లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

7ఏళ్ల బుడ్డోడు చేయకూడని పని.. Scorpioను సరదాగా నడిపేస్తున్నాడు

Published

on

ఏడేళ్లు బుడ్డోడు Mahindra Scorpio SUVను పబ్లిక్ రోడ్ మీద తిప్పేస్తున్నాడు. ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే లీగల్ గా 18 సంవత్సరాలు దాటాల్సిందే. గతంలో దీనిని అతిక్రమించిన చాలా మందిని పోలీసులు పట్టుకుని కేసులు కూడా పెట్టారు. ఇండియాలో చాలా మంది పిల్లలు పేరెంట్స్ పర్మిషన్ తో ఇంకా ఈ తప్పును చేస్తున్నారు.

నిజానికి ఇది చట్టవిరోధం. ఇలా చేస్తే పేరెంట్స్ ను జైలుకు పంపించడం ఖాయం. మోటార్ వెహికల్స్, కార్లు తక్కువ వయస్సు పిల్లలకు ఇచ్చి డ్రైవింగ్ చేయించడం తప్పు. ఈ వీడియోను సనాతన ధర్మ అనే యూట్యూబ్ ఛానెల్ అప్ లోడ్ చేసింది.ఇగ్నిషన్ కీ తీసుకుని కార్ ఎక్కుతున్న పిల్లవాడి దగ్గర్నుంచి స్టార్ అయిన వీడియో.. రోడ్ మీద నడిచేవారిని దాటుకుంటూ.. ఒక రౌండ్ వేసి చివరికి మళ్లీ అదే ప్లేస్ లోకి తీసుకొచ్చి ఆపాడు. నిజానికి ఆ పిల్లోడు కూర్చోవడానికి ఆ సీట్ మీద పూర్తిగా కూడా ఎత్తు సరిపోవడం లేదు.

ఆ స్కార్పియో వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. బుడ్డోడు డ్రైవింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి.. వీడియో రికార్డు చేయడానికి కారులోకి ఎక్కి కూర్చున్నాడు. ఏడేళ్ల పిల్లాడు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా గేర్లు మారుస్తూ.. కాలు అందకపోయినా ఎక్సిలేటర్ కోసం ముందుకు జరిగి క్లచ్ పెడల్ తో కరెక్ట్ గా హ్యాండిల్ చేశాడు.

ఒకవేళ పిల్లోడు సీట్ బెల్ట్ పెట్టుకుంటే క్లచ్ పెడల్ అందేది కాదేమో. మహీంద్రా స్కార్పియో లాంటి పెద్ద కారు తీసుకుని పబ్లిక్ రోడ్ల మీదకు వచ్చేటప్పుడు వయస్సు నడపగలడా అనేవి చూసుకోవాలని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.

అతను మంచి డ్రైవర్ యే కావొచ్చు. కానీ, మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉండకపోవచ్చు. అతని లైఫ్ తో పాటు రోడ్ మీద ప్రజల జీవితాలు కూడా రిస్క్ లో పెట్టినట్లే అవుతుందని.. శిక్షార్హమైన చర్య అని కామెంట్లు వస్తున్నాయి. గతంలోనూ 18ఏళ్లు అంతకంటే తక్కువ వయస్సున్న పిల్లలు డ్రైవింగ్ చేసినందుకు శిక్షలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *