లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

70 ఏళ్ల మహిళపై రేప్, మర్డర్

Published

on

MADHYA PRADESH: విచక్షణ మరిచి కళ్లు కామంతో మూసుకుపోయిన వ్యక్తులు 70ఏళ్ల వృద్ధురాలిని రేప్ చేసి ఆమె గుడిసె వద్దనే హత్యచేశారు. మధ్యప్రదేశ్ లోని విడిశా జిల్లాలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. భోపాల్ కు 80కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో మహిళ ఉంటుంది.

‘ఆ మహిళ పొలాల్లో గుడిసె వేసుకుని అక్కడే కొద్ది రోజులుగా ఉంటుంది. నిద్రిస్తున్న సమయంలో ఘటన జరిగి ఉంటుంది’ అని పోలీసులు తెలిపారు. నిందితుల గురించి పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు.‘మా అమ్మ కూరగాయల పంట దగ్గరే గుడిసె వేసుకుని అక్కడే ఉండేది. ఉదయం సమయంలో మాత్రమే ఇంటికి వచ్చేది. గురువారం ఉదయం తాను రాలేదు. ఆమెను చూడటానికి నేనే పొలానికి వెల్లా. గుడిసె పక్కనే ఆమె శవం అయి ఉండటం గమనించా’ అని మృతురాలి కొడుకు చెప్పుకొచ్చాడు.

మానసిక ఒత్తిడిలో కరోనా రోగులు, 6 నెలల్లో 67, 780 ఫోన్ కాల్స్


‘డాక్టర్లు ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు గమనించారు. ప్రైవేట్ పార్ట్స్ గాయపడినట్లు తెలిసింది. ఆమె నోరు మట్టితో నిండిపోయింది’ అని అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్(ఏఎస్పీ)సంజయ్ సాహూ తెలియజేశారు.

ఈ రేప్, మర్డర్ ఘటన గ్రామంలో కలకలం రేపింది. గ్రామంలో ఉద్రిక్త వాతావరణాన్ని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *