72nd Cannes Film Festival opens with zombie movie The Dead Don't Die

తారల సంద‌డి: కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌ 2019 ప్రారంభం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలిం ఫెస్టివల్‌గా చెప్పుకునే కేన్స్ వేడుక మంగ‌ళ‌వారం (మే 15, 2019) సాయంత్రం ప్రారంభ‌మైంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న టాలెంట్ ఆర్టిస్ట్‌లు అందరూ ఈ వేడుక‌లో పాల్గొన‌నున్నారు. ఈ వేడుకను ప‌ద‌కొండు రోజుల పాటు ఎంతో ఘ‌నంగా జ‌ర‌ుపుతారు.

అంతేకాదు కేన్స్ వేడుక ‘The Dead Don’t Die’ సినిమా ప్రీమియర్‌ షోతో ప్రారంభం కాగా ఈ కార్య‌క్ర‌మానికి ఎల్లే ఫాన్నింగ్‌, టిల్డా స్విన్ట‌న్‌, సెలెనా గోమెజ్‌, జులియానా మూరే హాజ‌ర‌య్యారు. 72వ అంత‌ర్జాతీయ కేన్స్ చ‌లన చిత్రోత్స‌వ వేడుక‌ ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్‌ రివేరా నదీ తీరాన ఉన్న కేన్స్‌ ప్రాంతంలో జ‌రుగుతున్న ఈ వేడుక‌కి ఇండియ‌న్ సెల‌బ్రిటీలు దీపికా ప‌దుకొణే, ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్‌, సోన‌మ్ క‌పూర్, కంగ‌నా ర‌నౌత్‌, డైనా పెంటి, మ‌ల్లికా షెరావత్, హీనా ఖాన్ త‌దిత‌రులు హాజ‌రు కానున్నారు.

Related Posts