ఎప్పుడు ఛస్తాడాని ఎదురు చూస్తూ..బతికుండగానే అన్నకాళ్లూ చేతులు కట్టేసి ఫ్రిజర్ లో పెట్టేసిన తమ్ముడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Tamilnadu : 74 వృద్ధుడి చావు కోసం ఎదురు చూస్తూ..స్వంత తమ్ముడే అన్నను ప్రాణం ఉండగానే శవాలను ఉంచే ఫ్రీజర్‌లో పెట్టి.. ప్రాణం ఎప్పుడు పోతుందాని ఎదురు చూస్తున్న ఘటన సేలంలో జరిగింది. భార్యను కోల్పోయి పిల్లలు లేని ఓ అన్న రక్తం పంచుకు పుట్టిన తమ్ముడితో పాటు బంధువులతో కలిసి ఉంటున్నాడు. హౌసింగ్‌ బోర్డు ఉద్యోగిగా సేవలందించి రిటైర్ తమ్ముడి ఇంట చేరాడు.కానీ అన్నను తమ్ముడు మాత్రం బరువనుకున్నాడు. ఈ క్రమంలో అన్నకు అనోరాగ్యానికి గురవ్వటంతో ఎప్పుడు ఛస్తాడా? అని ఎదురు చూస్తూ బ్రతికుండగానే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసి శవాల పెట్టిలో పడుకోబెట్టేశాడు.


వివరాల్లోకి వెళితే…సేలం కందపట్టి లో హౌసింగ్‌ బోర్డులో పనిచేసిన బాలసుబ్రమణ్య కుమార్ రిటైర్డ్‌ అయ్యారు. ఏడాది క్రితమే బాలసుబ్రమణ్య కుమార్ భార్య ఉష చనిపోయింది. పిల్లలు లేరు.దీంతో తన సోదరుడు శరవణన్, బంధువులు జయశ్రీ, గీతలతో కలిసి హౌసింగ్‌ బోర్డులో నివాసం ఉంటున్నారు. గత సెప్టెంబర్ లో బాలసుబ్రమణ్య కుమార్‌ అనారోగ్యం పాలవగా అతన్ని తమ్ముడు..బంధువులు కలిసి ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. కానీ వృద్ధాప్యంతోపాటు అనారోగ్యం కూడా తోడవ్వటంతో పరిస్థితి విషమించినట్టేనని..ఇక బతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు.


దీంతో బాలసుబ్రమణ్యాన్ని గత మంగళవారం (అక్టోబర్ 13,2020)ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చేశారు. తీసుకొచ్చిన కాసేపటికే బాలసుబ్రమణ్య కుమార్‌ కోమాలోకి వెళ్లిపోయారు. దీంతో అన్నయ్య చనిపోయినట్లేనని తమ్ముడు శరవణన్..బ్రతికుండగానే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు.


దీంట్లో భాగంగా ఫ్రీజర్‌ బాక్స్‌ (శవాలను పడుకోబెట్టే బాక్స్ )తెప్పించాడు. బతికే ఉన్న అన్నను శవాన్ని పడుకోబెట్టినట్లుగా కాళ్లు చేతులు, కట్టి మృతదేహంలా ఆ బాక్స్‌లో పడుకోబెట్టేశాడు. బాలసుబ్రమణ్య కుమార్‌ శరీరం చచ్చుబడ్డా..అతని గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉంది. ‘‘అబ్బా ఇంకా చావడేంటీ ఎంతసేపు ఇలా కాపలా కాయాలి’’ అనుకుంటు తమ్ముడు విసుక్కున్నాడు. గుండె కొట్టుకునే ఆ శబ్దం ఎప్పుడు ఆగుతుందో అని రాత్రంతా ఎదురు చూశాడు. కానీ తన్న గుండె కొట్టుకుంటూనే ఉంది.


ఈ క్రమంలో బుధవారం అంటే 14 ఉదయాన్నే ఫ్రీజర్‌ బాక్స్‌ అద్దెకు ఇచ్చిన వ్యక్తి బాక్స్ తీసుకెళ్లటానికి వచ్చాడు. బాలసుబ్రమణ్య కుమార్‌ శరీరంలో బాక్సులో ఉండటం చూశాడు. చనిపోయాడనుకున్నాడు. కానీ అతని శరీరంలో చలనం కనిపించడంతో..కళ్లు తెరచుకుని పరిశీలనగా చూశాడు. ఊపిరీ ఆడుతోంది. బాక్సులో పెట్టటం వల్ల బలవంతంగా ఊరిపి పీల్చలేని స్థితిలో ఉండటాన్ని చూసి ఆందోళన చెందాడు. బ్రతికుండగానే బాక్సులో పెట్టాసారా అని ఆశ్చర్యపోయాడు.


ఒకవేళ తమ్ముడు శరవణన్‌ అన్న బ్రతికే ఉండటాన్ని గమనించలేదేమో పొరపాటున అలా చేశాడనుకుని శరవణన్ కు మీ అన్న బతికేఉన్నాడనీ ఊరిపి ఆడుతోందని చెప్పాడు. కానీ పట్టించుకోక పోవడంతో కావాలని బ్రతికి ఉన్న అన్నను బాక్సులో పెట్టేశాడని నిర్ధారించుకున్న అతను వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.


వెంటనే వచ్చిన పోలీసులు ఫ్రీజర్‌ బాక్స్‌లో ఉన్న బాలసుబ్రమణ్యను బయటకు తీశారు. అప్పటికీ అతను బతికే ఉంటంతో వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం నిలకడగానే ఉంది. బ్రతికున్న అన్నను ఫ్రీజర్ బాక్సులో పెట్టిన శరశణన్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.


కేసు నమోదు చేసుకుని విచారించగా..శరవణన్ చెప్పిన మాటలు విని పోలీసులు విస్తుపోయారు. మా అన్న చనిపోవడం ఖాయం అని డాక్టర్లు చెప్పారు…తమకు సాయంగా ఎవ్వరూ లేరు.. అందుకే ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చిందనిచెప్పాడు. బ్రతికున్న అన్నను ఫ్రీజర్ బాక్సులో పెట్టిన బాలసుబ్రమణ్య కుమార్ వీడియో ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.

Related Tags :

Related Posts :