8 terrorist killed in the Shopian and Pampora areas jammu and kashmir

జమ్మూకశ్మీర్ లో 8మంది ఉగ్రవాదులు హతం..మసీదులో నక్కినవారిని ఎన్ కౌంటర్ చేసిన భద్రతాదళాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

జమ్మూకశ్మీర్‌లో భారత భద్రతా బలగాలు మరో ఎనిమిది మంది ఉగ్రవాదులను హతమార్చాయి. షోపియాన్, పాంపొరా జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలలో ఎనిమిదిమంది ఉగ్రవాదుల్ని భారత సైనికులు హతమార్చారు. పాంపొరాలో ముగ్గురు ఉగ్రవాదులు హంతం కాగా..షోపియాన్ లో ఐదుగురు హతమయ్యారు. ఇంకా కొంతమంది ఆ ప్రాంతాలలో నక్కి ఉన్నారనే సమాచారంతో గత 24 గంటలుగా ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయి.

పాంపొరాలోని పంపూర్ ప్రాంతంలోని ఓ మసీదులో నక్కిన ఉగ్రవాదులను బయటకు రప్పించడానికి భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్స్‌ను విజయవంతంగా వినియోగించారు. మసీదుకు నష్టం కలగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని వారిని హతమార్చారు. షోపియాన్‌లో మొత్తం ఐదుగురిని, పాంపొరాలో ముగ్గుర్ని హతమార్చినట్లు అధికారులు ప్రకటించారు.మసీదులో నక్కిన ఉగ్రవాదుల్ని భద్రతాదళాలుహతమార్చటంతో మసీదు కమిటీతో పాటు స్థానికులు హర్షం వ్యక్తంచేశారు. పోలీసు చీఫ్ తాహిర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

మరోవైపు, ఈ రోజు ఉదయం 10.45 నుంచి పాకిస్థాన్‌ రేంజర్లు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. పాక్‌ బలగాలు కాల్పులకు తెగబడుతుండడంతో వారి దాడిని భారత భద్రతా బలగాలు తిప్పికొడుతున్నాయి. రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లో పాక్‌ జవాన్లు కాల్పులకు పాల్పడుతున్నారు.  

Read: ఇలా చేయగలరా : కోడిగుడ్లను ఎలా పేర్చాడో చూడండి

Related Posts