ఏపీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 813 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

 ఏపీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 813 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 12మంది కరోనాతో చనిపోయారు. ఆదివారం(జూన్ 28,2020) రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా కేసుల వివరాలతో కూడిన బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో రాష్ట్రానికి సంబంధించినవి 775. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 50మందికి, విదేశాల నుంచి వచ్చి 8మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. కర్నూలు జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 13వేల 908కి చేరింది. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 169కి పెరిగింది. ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 7వేల 21. ఇప్పటివరకు రాష్ట్రంలో 5వేల 908మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రోజురోజుకి కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా టెస్టులు పెంచడం వల్లే కేసుల సంఖ్య పెరగుతోందని ప్రభుత్వం చెబుతోంది. కాగా కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ఇప్పటికే 5 జిల్లాల్లో(అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి) పలు ప్రాంతాల్లో మళ్లీ లాక్ డౌన్ విధించారు. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని, స్వీయ నియంత్రణలో ఉండాలని, కరోనా కట్టడిలో తమకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

* గడచిన 24 గంటల్లో 25,778 మంది నమూనాలు పరీక్షించగా 813 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ
* రాష్ట్రానికి చెందిన 775 మందికి, విదేశాలకు చెందిన 8 మందికి, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 50 మందికి కరోనా
* రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 13,098 కేసులు నమోదు
* గడిచిన 24 గంటల్లో 12 కరోనా మరణాలు
* కృష్ణా జిల్లాలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో ఆరుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కొరు మృతి
* రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 169
* కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 5వేల 908
* యాక్టివ్ కేసులు 7,021

Related Posts