ప్రాణాలు తీసిన న్యూడిల్స్.. ఒకే కుటుంబంలో 9 మంది మృతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

family members died eating noodles ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో జనాలు ఏం తింటున్నారో, ఎప్పుడు తయారైయ్యింది తింటున్నారో ఆలోచించే సమయం లేకుండా పోయింది. ఇక జంక్ పుడ్స్ విషయం అయితే చెప్పనక్కర్లేదు. వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని నిపుణులు చెబుతున్నా సరే.. అవేవి పటనట్టుగా వ్యవహారిస్తున్నారు జనాలు. తాజాగా ఓ కుటుంబం సంవత్సరం పాటు ఫ్రిజ్ లో నిలువ ఉన్న న్యూడిల్స్ ను తిని 9 మంది కుటుంబ సభ్యులు చనిపోయారు. ఈ ఘటన చైనాలోని హీలాంగ్జియాంగ్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళ్తే… నార్త్ ఈస్ట్రన్ చైనీస్ ప్రావిన్స్ లోని హీలాంగ్జియాంగ్ లో జీసి నగరంలో కొద్ది రోజుల క్రితం… ఓకే కుటుంబానికి చెందిన 12 మంది కుటుంబసభ్యులు కలుసుకున్నారు. అయితే.. దాదాపు ఒక సంవత్సరం పాటు ఫ్రిజ్‌లో ఉంచిన న్యూడిల్స్ ను తిన్నారు. పులియబెట్టిన మెుక్కజొన్నతో తయారు చేసిన న్యూడిల్స్ ని ఏడాది పాటు ఫ్రిజ్ లో తిన్నారు. తద్వారా కుటుంబంలోని తొమ్మిది మంది సభ్యులు అనారోగ్యానికి గురయ్యారు. వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లగా, అక్కడే చికిత్స పొందుతూ చనిపోయారు. అంతేకాక, అదే కుటుంబానికి చెందిన 3 పిల్లలకు ఆ వంటకం రుచి నచ్చక దాన్ని తినలేదు. అదృష్టవశాత్తు వీరు ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ సంఘటనపై చైనాలోని ‘హీలాంగ్జియాంగ్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌’కు చెందిన ఫుడ్‌ సేఫ్టీ డైరెక్టర్ గావో పీయ్‌ మాట్లాడుతూ.. మెుక్కజోన్నతో తయారు చేసిన న్యూడిల్స్ ను ఏడాది పాటు ఫ్రిజ్ లో ఉంచటం వల్ల , వాటిలో బాంగ్‌క్రెక్‌ అనే విష పదార్ధం తయారైంది. దీని కారణంగానే వారు మృత్యువాత పడ్డారు. బాంగ్‌క్రెక్‌అనేది చెడిపోయిన పదార్థాలలో ఎక్కువగా ఉంటుంది.
ఈ బాంగ్‌క్రెక్‌ అనే విషం శరీరంలోకి ప్రవేశించిన వెంటనే ప్రభావం చూపుతుంది. దీని వల్ల కడుపునొప్పి, చెమట పడ్డటం, నీరసం, కోమాలోకి వెళ్లటంతో పాటు… 24 గంటల్లోగా మరణం సంభవించవచ్చు. ఆ విషం మన శరీరంలోని కిడ్నీలు, లివర్‌, గుండె, బ్రెయిన్‌ పై త్రీవ ప్రభావం చూపుతాయిని గావో తెలిపారు. ఒక సారి ఈ విషం మన శరీరంలోకి చేరితే 40-100 శాతం వరకు మరణించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి దీనికి విరుగుడు మందు లేదు.
అంతేకాకుండా మనం ఎంత వేడి చేసినా సరే బాంగ్‌క్రెక్‌ అనే విషం మాత్రం నశించదు. ఇది ఎక్కువగా కొబ్బరితో తయారైన పదార్ధాలను పులియబెట్టడం వల్ల తయారవుతుందని గావో తెలిపారు. అందుకే ఇండోనేషియా సాంప్రదాయక వంటకం ‘టెంపె బాంగ్‌క్రెక్‌’ ను నిషేంచబడిందని ఆయన తెలిపారు.

Related Tags :

Related Posts :