ఏపీలో 24 గంట్లలో 9,024 కరోనా కేసులు, 87 మంది మృతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 9,024 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 58,315 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 9,024 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా పరీక్షల్లో 27,407 ట్రూనాట్‌ పద్ధతిలో, 30,908 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,44,549 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

కొత్తగా 9,113 మంది కరోనా బాధితులు కోలుకుని మంగళవారం (ఆగస్టు11, 2020) డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,54,749కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 87,597 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా బాధితుల్లో కొత్తగా 87 మంది మరణించారు. దీతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 2203కు చేరింది.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ఏపీ రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 25,92,619 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

Related Posts