920 corona virus cases registered in Telangana a single day

తెలంగాణలో ఒక్కరోజే 920 కరోనా కేసులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గురువారం (జూన్ 25, 2020) 920 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,364కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.
 
రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి 4,688 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 6,446 ఉన్నాయి. ఇవాళ కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 230కి చేరింది. ప్రస్తుతం నమోదైన కేసుల్లో 737 జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నాయి.

జీహెచ్ఎంసీ 737, రంగారెడ్డి 86, మేడ్చల్ 60, కరీంనగర్ 13, రాజన్నసిరిసిల్ల 4, మహబూబ్ నగర్ 3, నల్గొండ 3, ములుగు 2, వరంగల్ అర్బన్ 2, మెదక్ 2, వరంగల్ రూరల్ 1, కామారెడ్డి 1, సిద్దిపేట 1, వికారాబాద్ 1, జనగామ 1, మహబూబాబాద్ 1, ఆదిలాబాద్ 1, కుమరంభీం అసిఫాబాద్ 1 చొప్పున కేసులు నమోదు అయ్యాయి. 

Related Posts