9,372 Corona virus cases registered, 111 people killed in AP

ఏపీలో కరోనా విజృంభణ…9, 372 కు చేరిన పాజిటివ్ కేసులు.. 111 మంది మృతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్న మహమ్మారి మాత్రం తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. ఏపీలో కొత్తగా 443 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9, 372 కు చేరింది. 

రాష్ర్ట వ్యాప్తంగా 16, 704 నమూనాలను పరీక్షించగా 443 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 44 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఏడు మందికి కరోనా సోకింది. గడిచిన 24 గంటల్లో 83 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4435 కు చేరింది. కరోనాతో ఐదుగురు మరణించడంతో మృతుల సంఖ్య 111 కు చేరింది. 

ప్రస్తుతం రాష్ట్రంలో 4,826 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా వస్తున్న కేసుల్లో అనంతపురం జిల్లాదే ప్రధాన వాటా. ఆదివారం 70 కేసులు రాగా తాజాగా మరో 70 మంది వైరస్ బారిన పడ్డారు. ఇక తూర్పుగోదావరిలో 64, పశ్చిమగోదావరి 54, కర్నూలులో 60 కేసులు బయటపడ్డాయి. కడపలో 42, గుంటూరులో మరో 34 మంది కూడా వైరస్ బారిన పడ్డారు. 

కర్నూలులో కరోనా కేసులు 1354కు చేరాయి. కృష్ణాలో ఇప్పటికే వెయ్యి దాటాయి. ఇక అనంతపురంలో 870, గుంటూరులో 802, తూర్పుగోదావరిలో 619, పశ్చిమ గోదావరిలో 604 కేసులు ఉన్నాయి. చిత్తూరులోనూ కరోనా కేసులు 600 లకు దగ్గరగా ఉన్నాయి. అనంతపురంలో మొదట కరోనా తీవ్రత అంతగా లేనప్పటికీ ఇటీవల బాగా పెరిగింది. గత వారం రోజుల్లోనే కేసులు విపరీతంగా పెరిగాయి. 

కరోనా కట్టడికి ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ నివారణ చర్యలపై నిర్వహించిన జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. 104 వాహనాల ద్వారా ప్రతి కుటుంబ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, 104 వాహనాల్లోనే కోవిడ్ శాంపిల్స్ సేకరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పీహెచ్ సీలో కోవిడ్ శాంపిల్ కలెక్షన్ సెంటర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అన్నారు. ఇక జులై 1న 104, 108 కొత్త వాహనాలు ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. 

Related Posts