ప్రపంచ దేశాలకు భారత్ మొబైల్ మార్కెట్  అతిపెద్ద బిజినెస్ మార్కెట్‌గా అవతరించింది.

భారత్ వేదికగా ప్రముఖ పాపులర్ స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించనున్నాయి. 

భారత్ కేంద్రంగా తమ ప్రొడక్టులను  మనదేశంలోనే తయారుచేసేందుకు  ఆసక్తిని చూపిస్తున్నాయి. 

ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి భారత్  (Made In India) వేదికగా కొత్త  అసెంబ్లీ ప్లాంట్ ప్రారంభమైంది.

ఇప్పటికే Apple iPhone 13 ట్రయల్ తయారీని ప్రారంభించినట్లు కంపెనీ   వెల్లడించింది. 

ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆపిల్ ఐఫోన్ల తయారీని చెన్నైలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో తయారు చేస్తోంది. 

చెన్నై సమీపంలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ట్రయల్ ఉత్పత్తిని ప్రారంభించింది.

ఫిబ్రవరి నాటికి దేశీయ మార్కెట్ ఎగుమతుల కోసం భారత్‌లో ఐఫోన్ 13 వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాలని ఆపిల్ భావిస్తోంది.