ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు.

ఎందుకంటే ఉల్లి వంటకు రుచిని ఇవ్వటంలోనే కాదు ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది

ఉల్లిగడ్డలను కోసేప్పుడు అందులో నుంచి కొన్ని ఎంజైమ్స్‌తోపాటు ఘాటైన సల్ఫర్ గ్యాస్ విడుదలవుతుంది

అందుకే, వాటిని కోయగానే కళ్ల మంటలు పుట్టి నీరు కారుతుంది

మన దేశంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచే ఉల్లి పాయలను వాడుతున్నారట 

ఆంధ్రప్రదేశ్‌తో  పాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో ఉల్లి గడ్డలను పండిస్తున్నారు

పచ్చి ఉల్లిగడ్డలు జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. ఎర్రగా ఉండే ఉల్లిపాయలు శరీరంలో మంచి కొవ్వుల ఏర్పాటుకు తోడ్పడతాయి

పచ్చి ఉల్లిగడ్డలు జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. ఎర్రగా ఉండే ఉల్లిపాయలు శరీరంలో మంచి కొవ్వుల ఏర్పాటుకు తోడ్పడతాయి

ఉల్లిలో అధిక మోతాదులో ఉండే సల్ఫర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి, పీచు పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి

మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్ల సమస్యతో బాధపడేవారికి ఉల్లి మంచి ఔషదం

ఉల్లిపాయలను సన్నగా తరిగి పెరుగులో కలిపి రోజూ ఉదయం వేళలో తీసుకుంటే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి

చర్మ సౌందర్యాన్ని పెంచుకోవాలంటే ఉల్లిని తప్పకుండా తీసుకోండి.

చర్మ సౌందర్యాన్ని పెంచుకోవాలంటే ఉల్లిని తప్పకుండా తీసుకోండి

రక్తహీనతో బాధపడేవారు పటికీ బెల్లం నీటితో ఉల్లిపాయలను కలిపి తీసుకుంటే మంచిది

ఫైల్స్‌తో బాధపడుతున్నవారు ఉల్లి గడ్డ ముక్కలు, కాస్త పంచదార వేసుకుని తింటే ఉపశమనం లభిస్తుంది