సాధారణంగా మహిళలు కనుబొమ్మ‌ల మ‌ధ్య‌.. నుదుట మీద పెట్టుకుంటారు

ఎక్కువ శాతం మంది క‌నుబొమ్మ‌ల మ‌ధ్య‌లోనే బొట్టును పెట్టుకుంటారు

ప్రాచీన కాలంలో మ‌హిళ‌లు, పురుషులు చాలా పెద్ద‌ బొట్టు పెట్టుకునే వారు

కాలం గ‌డుస్తున్న కొద్ది  బొట్టు సైజు తగ్గి..  రకరకాల రంగులలో పెడుతున్నారు

క‌నుబొమ్మ‌ల మ‌ధ్యే బొట్టు పెట్టుకొవ‌డానికి బ‌ల‌మైన కార‌ణాలు ఉన్నాయి

మన కనుబొమ్మల మధ్య  ఆజ్ఞాచక్రం అని ఒక‌టి ఉంటుంది

ఆ ఆజ్ఞా చ‌క్రం ఎప్పుడూ  వేడి పుట్టిస్తూ ఉంటుంది

ఆ ప్రాంతంలో చ‌ల్లద‌నం ఉండాల‌నే ఉద్ధేశంతో బొట్టు ధరించేవారు

కుంకుమ, పసుపు, భస్మం, చందనం, తిలకం, శ్రీచూర్ణంతో ఈ బొట్టు ఉండేది

ఇప్పుడు రకరకాల రంగులు, కెమికల్స్, స్టిక్కర్లతో ఈ బొట్టు పెట్టుకుంటున్నారు