తిరుమల కొండ..కలియుగ దైవం శ్రీవారు కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం..

తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవాలంటే ఏడు కొండలు ఎక్కాల్సిందే..

ఈ ఏడు కొండలకూ.. ఏడు విశిష్టతలు..

సప్తగిరుల్లో ప్రధానమైనది ‘శేషాద్రి’.. శేషాచలం అని ప్రసిద్ధి..

స్వామివారికి తొలిసారిగా తన తలనీలాలను సమర్పించిన భక్తురాలి పేరుతో ‘నీలాద్రి’

వైకుంఠం చేరే వరమివ్వమని కోరిన గరుత్మండు పేరుతో ‘గరుడాద్రి’..

ఆంజనేయుడు తల్లి అంజనాదేవి తపస్సు చేసిన కొండే ‘అంజనాద్రి’..

వృషభాసురుడు పేరుతో ‘వృషభాద్రి’..

నారాయణమహర్షి  తపమాచరించిన పవిత్రస్థలమే ‘నారాయణాద్రి’..

శ్రీవారు వెలసిన గిరి ‘వేంకటాద్రి’'వేం' అంటే పాపాలు అని, 'కట' అంటే హరించడం అనీ అర్థం

ఈ ఏడు కొండల్లో తిరుమల కొండపై అంజనాదేవి ఆలయ నిర్మాణానికి టీటీడీ సన్నాహాలు చేస్తోంది..