యూనిస్‌ తుఫాను బీభత్సం.. రాకాసి గాలుల భయానక దృశ్యాలు..!

సెంట్రల్ అట్లాంటిక్‌లో యూనిస్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. 

వాయువ్య ఐరోపాలో యూనిస్ తుఫాను ప్రభావంతో గంటకు 122 మైళ్ల వేగంతో రాకాసి గాలులు వీస్తున్నాయి. 

సెంట్రల్ అట్లాంటిక్‌లో యూనిస్ తుఫాను అజోర్స్ నుంచి యూరప్ వైపు దూసుకెళ్తోంది.

ఈ గాలుల ధాటికి రోడ్లపై వెళ్లేవారు శిధిలాలు గాల్లో కొట్టుకుపోతున్నాయి. 

తుఫాను బీభత్సానికి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మహిళ ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టి మృతి చెందింది.

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇంగ్లండ్‌‌లో బలమైన గాలులు వీస్తున్నాయి. 

తుఫాను కారణంగా 10వేల మంది నివాసితులకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. చెట్లు కూలి కార్లు ధ్వంసమయ్యాయి.

లివర్‌పూల్‌లో గాలుల ప్రభావానికి శిథిలాలు గాల్లో ఎగిరిపోతున్నాయి... మొత్తం 436 విమానాలు రద్దు అయ్యాయి.