కొందరికి రోడ్డు ప్రయాణాల్లో పదేపదే వాంతులొస్తుంటాయి.. బస్సులో, కార్లలో,షిప్పులో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందికి వాంతులు, వికారం, తలతిరగడం వంటి లక్షణాలు కలుగుతాయి. దీనిని మోషన్ సిక్‌నెస్ అంటారు.

కొందరికి రోడ్డు ప్రయాణాల్లో పదేపదే వాంతులొస్తుంటాయి.. బస్సులో, కార్లలో,షిప్పులో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందికి వాంతులు, వికారం, తలతిరగడం వంటి లక్షణాలు కలుగుతాయి. దీనిని మోషన్ సిక్‌నెస్ అంటారు.

ఇది మానసిక సమస్యా అంటే  కాదు అంటున్నారు వైద్యులు.  ఈ సమస్యను ఎలా అధిగమించాలో  తెలియక ప్రయాణాలు  కూడా మానుకుంటుంటారు.

డీజిల్, పెట్రోలు,బీడీ, సిగరెట్, చుట్ట, వీటి వాసనలు, మురుగు వాసనలు కడుపులో తిప్పుతాయి. ఇలాంటి పరిస్ధితికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి.

ప్రయాణంలో వాంతులు తగ్గాలి అంటే కొన్ని చిట్టి చిట్కాలు పాటించి చూడండి. ప్రయాణాన్ని ఆనందంగా ఎంజాయ్ చేయండి

అల్లం చాలా బాగా తెలిసిన యాంటిమెటిక్ మెడిసిన్ . ఇది వాంతులను చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. కాబట్టి, ప్రయాణానికి ముందు జింజర్ టీ లేదా అల్లంతో తయారుచేసి ఆహారాలను తీసుకుంటే, వాంతులు, వికారం తగ్గించుకోవచ్చు

ఆపిల్ సైడర్ వెనిగర్‌ను ఒక కప్పు నీటిలో మిక్స్ చేయాలి. ప్రయాణానికి ముందు ఈ నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాంతులు మరియు వికారం తగ్గించుకోవచ్చు

పుదీనా కూడా వాంతులను తగ్గించడంలో చాలాగొప్పగా సహాయ పడుతుంది. ఫ్రెష్ గా ఉండే పుదీనా ఆకులను నీళ్ళలో వేసి బాగా మరిగించి ప్రయాణానికి ముందు తీసుకోవాలి. పుదీనా ఆకు నుండి వచ్చే సువాసన కూడా వాంతులు మరియు వికారం తగ్గిస్తాయి.

యాంటీ ఎమిటిక్ లక్షణాలు దాల్చిన చెక్కలో కూడా పుష్కలంగా ఉన్నాయి . కొద్దిగా దాల్చిన చెక్కను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని గోరువెచ్చగా తీసుకోవడం వల్ల వాంతులు వికారం తొలగిపోతుంది

ప్రయాణంలో తరచూ యాలకలను నోట్లో వేసుకొని నమలడం వల్ల వాంతులు మరియు వికారం తగ్గిస్తుంది.  అలాగే మీరు యాలకలు, దాల్చిన చెక్కతో తయారుచేసిన టీని తీసుకోవచ్చు

పెప్పర్ మరియు నిమ్మరసం మిక్స్ చేసిన వాటర్ త్రాగడం వల్ల తలనొప్పి, మరియు తలతిరగడం వంటి లక్షణాల నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది