రష్యా-యుక్రెయిన్ మధ్య..  యుద్ధం హోరా హోరీగా జరుగుతోంది...

ఈ రెండు దేశాల యుద్ధంతో రష్యా యుక్రెయిన్ పై అణ్వాయుధాలు ప్రయోగిస్తుందనే భయాందోళనలు కలుగుతున్నాయి...

అమెరికాలో న్యూమెక్సికోలోని అలోమాగార్డో ఎయిర్ బేస్‌లో 1945 జులై 16వ తేదీన అణ్వాయుధ పరీక్ష జరిగింది.

ఈ అణ్వాయుధ పరీక్ష జరిగిన కొన్నివారాల్లోనే అదే ఏడాదిలో ఆగస్టు 6న జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకి మీద అణుబాంబు పరీక్ష జరిగింది..

ఈ అణుబాంబు దాడి తో హిరోషిమాలో 1,66,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నాగసాకిలో 60వేల నుంచి 80వేల మంది ప్రాణాలు కోల్పోయారు..

ప్రపంచంలో జనవరి 2021 నాటికి తొమ్మిది దేశాలు న్యూక్లియర్ ఆయుధాలను కలిగి ఉన్నాయి..

రష్యా వద్ద 6255 అణుబాంబులు ఉన్నాయి..

అమెరికా దగ్గర.. 5550 అణుబాంబులు ఉన్నాయి..

చైనా దగ్గర 350 అణుబాంబులు ఉన్నాయి..

ఫ్రాన్స్ దగ్గర 290..  అణుబాంబులు ఉన్నాయి..

బ్రిటన్ దగ్గర 225..

పాకిస్తాన్ దగ్గర 165..

 ఉత్తర కొరియా దగ్గర 40 నుంచి 50 అణ్వాయుధాలు ఉన్నాయని నివేదికల అంచనా 

ఇజ్రాయెల్ దగ్గర 90 అణు బాంబులు ఉన్నాయి...

ప్రపంచవ్యాప్తంగా 3825 అణ్వాయుధాలు మాత్రమే ప్రయోగానికి రెడీగా ఉన్నాయట..

అందులో అమెరికా దగ్గర 1800 ఉంటే...

రష్యా దగ్గర.. 1625 అణ్వాయుధాలు ఉన్నాయి

ఫ్రాన్స్ దగ్గర 280 అణ్వాయుధాలు,.. బ్రిటన్ దగ్గర 120 వరకు అణ్వాయుధాలు ఉన్నాయి..