రష్యా యుక్రెయిన్‌  యుధ్దంలో  కీవ్‌ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న రష్యా దళాలకు  నాలుగు రోజులుగా యుక్రెయిన్ ప్రజలు  ఊహించని  విధంగా  ఎటాక్ ఇస్తున్నారు

ఉక్రెయిన్ లోని  ప్రావ్డా బ్రూవరీ రష్యా దళాలకు  వ్యతిరేకంగా  యుద్దంలో పాల్గోంటోంది.  యుక్రెయిన్ ప్రజల కోసం మోలోటోవ్  కాక్ టెయిల్ క్రాఫ్ట్ బీరును తయారు చేస్తోంది

ఎల్వివ్ నగరాన్ని రష్యన్ ట్యాంకులు  చుట్టుముట్టిట్లు తెలిసిన తర్వాత బ్రూవరీ సంస్ధ బీరు బాంబులను తయారు చేయటానికి సిధ్దపడింది

దేశాన్ని రక్షించాలని అధ్యక్షుడు  వోలోడిమిర్ జెలెన్స్‌కీ చేసిన పిలుపుకు ప్రతిస్పందించింది బ్రూవరీ యాజమాన్యం

ఈ బీర్‌ బాటిళ్లలో ఆయిల్‌, పెట్రోల్‌ మిక్స్‌ చేసి వాడేస్తున్నారు. అందులో గుడ్డను ముంచి  దానికి నిప్పంటించి రష్యా బలగాల వైపునకు విసిరేస్తున్నారు

సీసా మూత  భాగంలో ఉన్న వస్త్రానికి  నిప్పు అంటించి శత్రు సేనలపై విసిరి కొడితే అవతలి వాళ్లు ఆ పెట్రోల్ బాంబు దాడిలో చనిపోవటం ఖాయం

లోపల ఉండే కాక్ టెయిల్ పెట్రోల్, ఆల్కహాల్ మాదిరే మండే స్వభావంతో ఉంటుంది

బట్ట బాగా నాని పోయి ఉందంటే కాక్టెయిల్ బాంబు సిధ్ధంగా ఉందని అర్ధం అని చెప్పాడు వాటిని తయారు చేస్తున్న ఓ  యువకుడు

వయస్సుతో నిమిత్తం లేకుండా యుక్రెయిన్ ప్రజలంతా బ్రూవరీతో సంబంధం లేకుండా బీరుబాంబులు తయారు చేయటంలో బిజీ బీజీగా ఉండి  తమ దేశాన్నికాపాడుకునే యత్నంలో ఉన్నారు

బీరు బాంబులు చేయటం ఇవాళ కొత్తేమి కాదని 2014లో క్రిమియా సంక్షోభం సమయంలోనూ ప్రత్యర్థుల మీద ఈ తరహా దాడులు జరిగాయని బ్రూవరీ యజమాని యూరీ జాస్టనీ చెప్పారు