పోషకాల పుదీనా గురించి ఎంత చెప్పినా తక్కువే..

పుదీనా కూరల్లో కరివేపాకు వేసినట్లే, నాలుగు పుదీనా రెబ్బలు కూడా వేస్తే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా.

ప్రతి రోజు నాలుగు పుదీనా ఆకులు తెంపి కూరల్లో వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది..

పోషక విలువలున్న  పుదీనా వెరీ వెరీ బెస్ట్.. అంటున్నారు నిపుణులు..

పుదీనా ఆరోగ్యానికే కాదు చక్కటి సౌందర్యసాధనం కూడా..

జలుబు, దగ్గు వస్తే..పుదీనా ఆయిల్‌తో ఆవిరి పడితే ఉపశమనంగా ఉంటుంది.

కడుపునొప్పిగా ఉంటే.. ఒక స్పూన్ చక్కెర,  పుదీనా ఆకుల రసం కలిపి తీసుకుంటే కడుపునొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది.

తలనొప్పి సమస్యకు పుదీనా ఆకులు చక్కటి పరిష్కారం..పుదీనాను మెత్తగా నూరి తలకు పట్టిస్తే తలనొప్పి తగ్గుతుంది.

దంతాల సమస్యకు బహుబాగు పుదీనా..గుప్పెడు పుదీనా ఆకులను తీసుకుని బాగా నమిలితే పంటి నొప్పి హుష్ కాకి..

జలుబు, దగ్గు వస్తే..పుదీనా ఆయిల్‌తో ఆవిరి పడితే ఉపశమనంగా ఉంటుంది.