ఉప్పు అధికంగా వాడితే రక్తపోటు వస్తుందని మాత్రమే వినుంటాం.

తాజాగా ఉప్పు అధిక మోతాదులో తీసుకుంటే మధుమేహం కూడా వస్తుందని పరిశోధకలు చెప్తున్నారు.

స్టాక్‌హోంలోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్యయనంలో ఈ విషయం తేలింది

రోజుకు రెండు చెంచాలు తీసుకునే వారిలో మధుమేహం వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నట్లు తేలింది. 

తీపి పదార్థాలు, చక్కెర, పండ్లరసాలతో పాటుగా, ఉప్పు ఎక్కువగా తీసుకోవడంతో మధుమేహంతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది.

ఉప్పు ఇన్సులిన్‌కు ఉత్పత్తికి విఘాతంగా మారి మధుమేహానికి దారి తీస్తున్నట్టు చెబుతున్నారు.

అధిక ఉప్పుతో రక్తపోటు, అధిక బరువు పెరగడంతో మధుమేహం వస్తుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.

రోజుకు 1500 మి.గ్రా సోడియం మించకుండా చూసుకోవాలి. 

కూరలు, పచ్చళ్లు, చిరుతిళ్లు, పెరుగులో అదనంగా వేసుకుంటే ప్రమాదం తెచ్చుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఉప్పుకు బదులు కాస్త మిరియాల పొడి వాడటం వల్ల మధుమేహం ముప్పు నుంచి బయట పడే అవకాశాలున్నాయి.