ఈ భూమ్మీద ఎన్నో జంతువుల జీవనం సాగిస్తున్నాయి..

భూమ్మీద కొన్ని జంతువులు జీవిస్తున్నాయి...

నీటిలో .. కొన్ని జీవిస్తున్నాయి..

నీటిలోను..భూమ్మీద మనుగడ సాగించేవి (ఉభయ చరాలు) మరికొన్ని..

కొన్ని సుదీర్ఘకాలం జీవిస్తే..మరికొన్ని అతి కొద్దికాలమే జీవించి చనిపోతుంటాయి..

ఎక్కువ కాలం జీవించేవి ఏమిటో కొన్నింటి గురించి తెలుసుకుందాం..

తాబేలు :  తాబేలు ఎక్కువ కాలం జీవించే జీవి. 200ల నుంచి దాదాపు 500ల ఏళ్లు జీవిస్తుందని శాస్త్రవేత్తలు చెబతున్నారు. కోల్ కతాలోని అలీపూర్ జూలో అడ్వేత అనే తాబేలు 255 ఏళ్ల వయసులో మరణించింది..

రఫియన్ రాక్ ఫిష్ : ఈ జాతి చేపలు 205 సంవత్సరాలు జీవిస్తాయి. లేత కాషాయ రంగులో ఉండే ఈ చేప పసిఫిక్ మహాసముద్రంలో కాలిఫోర్నియా నుంచి జపాన్ వరకూ కనిపిస్తుంది. ఇది 38 అంగుళాల వరకూ పొడవు పెరుగుతుంది. ప్రస్తుతం ఈ చేప అంతరించి పోతున్న జీవుల జాబితాలో ఉంది.

బౌ హెడ్ వేల్: ఇది ఆర్కిటిక్ సముద్రాల్లో కనిపిస్తుంది. 100 ఏళ్లకు పైగా జీవిస్తుంది.వేటకు గురికాకపోతే 200 ఏళ్ళు కూడా జీవిస్తాయి..

మంచినీటి పెర్ల్ మసెల్స్  నీటిలో ఉండే ఆహార పదార్ధాల ఆచక్కటి కణాలను ఫిల్టర్ చేసి వాటి కడుపుని నింపుకుని బ్రతికే జీవులు. ఇవి సాధారణంగా నదులలో కనిపిస్తాయి.  ప్రపంచంలోని పురాతన మంచినీటి పెర్ల్ మస్సెల్ వయసు 280 ఏళ్ళు.

ఆర్కిటిక్ మహాసముద్రంలో లోతులో జీవించే..   ఈ గ్రీన్లాండ్ షార్క్ వయస్సు 392 సంవత్సరాలు. –

కోయి కార్ప్ చేపలు (50 సంవత్సరాలు)

మాకా (100 సంవత్సరాల వయస్సు)

యూరోపియన్ ప్రోటీస్ (100 Years)