ఆడవారు పెళ్లి తర్వాత.. తల్లైన తర్వాత కెరీర్ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టంగా భావిస్తారు

ఇక, సినిమా, క్రీడా రంగానికి చెందిన వారిలో తల్లైన తర్వాత కొనసాగడం చాలా అరుదు

కానీ కొంత మంది క్రీడాకారిణులు అటు తల్లిగా ఇటు కెరీర్‌లో కూడా సక్సెస్ అనిపించుకున్నారు

ఈ లిస్ట్‌లో మేరీ కోమ్ పేరు ముందుగా చెప్పుకోవాల్సి ఉంది. బాక్సర్ అయిన మేరీ కోమ్ నలుగురు పిల్లల తల్లైన తర్వాత కూడా ఎన్నో పోటీల్లో పాల్గొన్నారు

పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ని వివాహం చేసుకున్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బాబుకి జన్మనిచ్చిన తర్వాత కూడా కొంతకాలం క్రీడాకారిణిగా కొనసాగారు

హై జంప్ కేటగిరీలో జాతీయ రికార్డు సృష్టించిన సహాన కుమారి ఒలింపిక్స్‌లో పాల్గొనే సమయానికి ఒక అమ్మాయికి తల్లి కాగా ఇప్పుడు తన కూతురు కూడా హై జంప్ క్రీడాకారిణే

చెస్ ఛాంపియన్ కోనేరు హంపి కూడా పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి అయ్యాక కొంత గ్యాప్ తీసుకొని 2019లో తిరిగి మళ్ళీ ఆట మొదలు పెట్టారు

భారత బాస్కెట్ బాల్ జట్టు మాజీ కెప్టెన్ అయిన అనిత పాల్ దురై 2013లో ఒక బిడ్డకు తల్లి అయ్యాక మళ్ళీ ప్రాక్టీస్ చేసి బాస్కెట్ బాల్ ఆటని కొనసాగించారు

డిస్కస్ త్రోలో ఎన్నో రికార్డులు నెలకొల్పిన కృష్ణ పూనియా ఒక బాబుకి జన్మనిచ్చిన తర్వాత కూడా అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు

బాక్సర్ అయిన సరితాదేవి పెళ్లి అయ్యి కొడుకు పుట్టిన తర్వాత కూడా ఏషియన్ గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్‌లో వెండి పతకాలు సాధించారు