వేసవి తాపాన్ని తగ్గించటంలో సబ్జాగింజలు బాగా ఉపకరిస్తాయి.

డీహైడ్రేషన్ కు చెక్ సబ్జా పానీయం..

సబ్జా గింజలను నానబెట్టుకుని పానీయంగా తీసుకుంటే వేసవిలో వడదెబ్బ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.

వేసవి కాలంలో అధిక వేడికి వచ్చే తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు ఈ గింజల్ని నీళ్లలో కలుపుకొని తాగితే సమస్య హుష్ కాకి..

గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి..

సబ్జా గింజల పానీయంలో అల్లం రసం, తేనే కలిపి తాగితే శ్వాసకోస వ్యాధులను నివారించొచ్చు.

శరీరంలో తేమ తగ్గి నీరసించిపోయిన వారు ఈ విత్తనాలను రోజూ తీసుకుంటే శరీరంలో తేమను పోనీకుండా నిలిపి ఉంచుతాయి..

చికెన్ పాక్స్ వచ్చిన వారికి పొక్కుల వల్ల మంట అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు సబ్జాగింజలు నీళ్లలో నానబెట్టి కొబ్బరినీళ్లలో కలిపి తాగిస్తే సత్వర ఫలితం ఉంటుంది.