తలకు రాసుకునే నూనెల్లో ఆముదం, కొబ్బరి నూనెలకు ప్రస్తుతం ఎంతో ప్రాధాన్యత ఉంది.

ఆముదం తలకు రాయటం వల్ల జుట్టు ఒత్తుగా, నల్లగా పెరగటానికి ఉపకరిస్తుంది.

కొబ్బరినూనెలో సైతం యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ వైరల్ , యాంటీ ఫంగల్ గుణాలు ఇన్‌ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.

మెడిసిన్ వాడే వారు, హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, కాలుష్య సమస్యలతో బాధపడుతున్న వారు తలకు కొబ్బరి నూనె వాడటం మంచిది.

జుట్టు కుదుళ్ళు బలంగా చేయటంతోపాటు, జట్టును చిట్లిపోవటాన్ని , ఊడిపోవటాన్ని నివారిస్తుంది.

200గ్రాముల కొబ్బరి నూనె, 100 గ్రాముల ఆముదం పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి.

వేడయ్యాక 10 ఉసిరికాయల చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. గుప్పెడు వేప ఆకులను వేసి ఒక స్పూన్ కలోంజి గింజలు, ఒక స్పూన్ మెంతులు వేసి బాగా మరిగించాలి.

ఆ తర్వాత వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. తలకు రాసి 5నిమిషాలపాటు మసాజ్ చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి.

ఈ నూనె చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది.

వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది.