జీవన శైలిలో మార్పులు, షిఫ్ట్ లు వారిగా ఉద్యోగాల కారణంగా కళ్ళు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి.

ఎండల కారణంగా కాంతివంతమై కళ్లు ఎరుపెక్కడం, కంటి కింద భాగం ఉబ్బెత్తుగా అవ్వడం వంటి సమస్యలు.

వాహన ప్రయాణంలో కళ్ళద్దాలతో పాటు, హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరిగా ధరించాలి.

పోషకాలు, నీరు తీసుకుంటే వేసవిలో కంటి సమస్యలు రావు. 

విటమిన్ ఏ సమృద్దిగా ఉండే ఆకు కూరలు, చేపలు, పండ్లు, క్యారెట్, గుడ్లు ఎక్కువగా తీసుకోవాలి. 

కళ్ళల్లో దుమ్ము, తేమ తగ్గడం వల్ల కళ్ళు ఎరుపెక్కడం, కంటి కురుపులు వస్తాయి.

ఎండలో నుంచి రాగానే కళ్ళు, ముఖం చల్లటి నీటితో కడుక్కోవాలి.

యూవీ కిరణాల నుండి రక్షించే సన్ గ్లాసెస్ ను ఉపయోగించాలి.

సూర్యుడి కిరణాలు నేరుగా కళ్లపై పడకుండా తలకు టోపీని ధరించటం అలవాటుగా మార్చుకోండి.

చర్మం, కళ్లు రెండు హైడ్రేట్ గా ఉండటానికి నీరు ఎక్కువగా సేవించాలి. 

నీటిలో కొంచెం ఉప్పు కలిపి ఆ నీటితో కళ్ళను కడిగితే కళ్ళు నిర్మలంగామారి, మెరుస్తాయి.