ఈరోజుల్లో  జుట్టు సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి..

జుట్టు రాలిపోవటం..పొడిబారి నిర్జీవంగా మారిపోవటం జరుగుతోంది..

జుట్టు పొడిబారిపోయిన వారు కొన్ని రకాల చిట్కాలను అనుసరించి తళతళ మెరిసే జుట్టు పొందొచ్చు..

జుట్టు మెరుపు కోసం వాడే హెయిర్ మాస్క్ లు, ప్యాక్ లు చేసినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. అలాంటి వారికి కొన్ని  చిట్కాలు చక్కని ఫలితాన్ని ఇస్తాయి..

కుంకుడు కాయలను ముందుగా గంట సమయం నానబెట్టుకోవాలి. అందులో కాస్త ఉసిరి పొడి కలుపుకుని తలస్నానం చేస్తే జుట్టు  పట్టులా తయారవుతుంది..

బొప్పాయి ముక్కలను గుజ్జులో పెరుగు కలిపి తలకు రాసుకుని అరంగంట ఆరనివ్వాలి. తరువాత తలస్నానం చేస్తే జట్టు మృదువుగా మారుతుంది.

కోడిగుడ్డు సొనలో కాస్త ఆలివ్ అయిల్ కలిపి తలకు రాసుకుని పావుగంట ఉంచి తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే జుట్టు నిగారింపు సంతరించుకుంటుంది.

పావు కప్పు నిమ్మరసంలో మినుముల పొడి, పెరుగు కలిపి జుట్టుకు బాగా పట్టించండి. అరగంట తరువాత తలస్నానం చేయాలి ఇలా వారానికి రెండు సార్లు చేస్తే..జట్టుకు మెరుపు వస్తుంది.

కొబ్బరి పాలలో శనగ పిండి కలిపి తలపై బాగా పట్టించాలి. పావు గంటతల స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల జుట్టు తళతళ మెరిసిపోతుంది. కుదుళ్ళు బలంగా మారాతాయి.

మెంతులు, గోరింటాకు నీటిలో వేసి బాగా మరిగించి చల్లారక కాస్త నిమ్మరసం కలుపి ఈ విశ్రమంతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

వీటితో పాటు జుట్టు ఆరోగ్యానికి ఎ, బి, సి, డి, ఇ వంటి విటమిన్లు ఉండేలా చూసుకోవాలి.