భారతీయ  తొలి మహిళా డాక్టర్  ‘ఆనందీ గోపాల్‌ జోషి’..

1865 మార్చి 31న మహారాష్ట్రలోని పూణేలో జన్మించారు. ఆనందీకి తల్లితండ్రులు యమున అని   పేరు పెట్టారు.

ఆనందీ జోషికి 9 ఏళ్ల వయసులో 20 ఏళ్లు పెద్దవాడైన గోపాల్ రావుతో  జోషిని వివాహం   చేశారు.

వివాహం తరువాత.. ఆమె భర్త గోపాల్ రావు ఆనందీబాయి అని పేరు పెట్టారు.

ఆనందీ తన 14వ ఏట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. పుట్టిన 10 రోజులకే తీవ్ర   అనారోగ్యానికి గురైన ఆ శిశువు కన్నుమూశాడు.

దీంతో తన బిడ్డ చనిపోయినట్లుగా ఎవ్వరు చనిపోకూడదని ఆనందీ డాక్టర్ అవ్వాలని   నిర్ణయించుకున్నారు..

పేదలకు సేవ చేయాలనే ఆకాంక్షతో ఆనందీ అమెరికాకు బయలుదేరి వెళ్లారు. పెన్సిల్వేనియా   ఉమెన్స్ కాలేజీలో మెడిసిన్ చదివారు. 16 ఏళ్ల వయసులోనే MBBS పట్టా పొందారు.

ప్రసూతి అంశాలపై పరిశోధనకు చేసినందుకు గానూ నాటి విక్టోరియా రాణి.. ఆనందీపై ప్రశంసలు   కురిపించారు.

1886లో భారత్‌కు తిరిగి వచ్చేసిన ఆనందీ బాయ్ గోపాల్‌రావ్ జోషి.. కొల్హాపూర్‌లోని అల్బర్ట్   ఎడ్వర్డ్ ఆసుపత్రిలో ఫిజీషియన్‌గా చేరారు. మంచి డాక్టర్ గా గుర్తింపు సాధించారు.

ఇంతలోనే ఆనందీ జోషి క్షయ మహమ్మారి బారినపడి  21 ఏళ్ల వయస్సులోనే  కన్నుమూశారు.

అమెరికాలో అడుగుపెట్టిన  తొలి హిందూ మహిళ కూడా ఆనందీ జోషియేనని అంటారు.