ఉగాది పచ్చడికి మన శాస్త్రాలలో నింబ కుసుమ భక్షణం,అశోకకళికా ప్రాశనంగా పిలుస్తారు.

ఋతువు మార్పు కారణంగా వచ్చే వాత,కఫ ,పిత్త దోషాలను హరించే ఔషదంగా ఉగాది పచ్చడిని తినే ఆచారం పూర్వనుండి వస్తోంది..

షడ్రుచులు అంటే తీపి పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు ఇలా  ఆరు రుచుల సమ్మేళనంతో ఈ పచ్చడిని తయారు చేస్తారు.

ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్ధాలు : మీడియం సైజు మామిడికాయ ఒకటి.. వేప పువ్వు- 1/2 కప్పు

సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు 1/2 కప్పు..

కొత్త చింతపండు- 100 గ్రాములు కొత్త బెల్లం- 100 గ్రాములు

రెండు మిరపకాయలు.. ఒక అరటిపండు..

చెరకు రసం -1/2 కప్పు, ఉప్పు సరిపడేంత,  తగినన్నినీళ్లు సిద్ధం చేసుకోవాలి.

ఉగాది పచ్చడి తయారీ విధానం : వేప కొమ్మల నుంచి పువ్వును వేరు చేసి  పెట్టుకోవాలి.

అన్నీ పచ్చడి చేయటానికి కావాల్సిన అన్ని పదార్ధాలు రెడీగా పెట్టుకోవాలి.  

చింతపండు పులుసులో మామిడి ముక్కలు, కొబ్బరి, మిరపకాయ ముక్కలు, ఉప్పు,వేపపువ్వు,  బెల్లం, చెరుకురసంతోపాటు అన్ని పదార్ధాలు వేసి కలుపుకోవాలి..

అంతే షడ్రుచుల ఉగాది పచ్చడి రెడీ.. ఇక వసంత లక్ష్మీని ఆహ్వానించి, నైవేద్యంగా సమర్పించి, తర్వాత తినాలి..

ఈ పచ్చడిలో అనేక ఔషదగుణాలు దాగున్నాయి. పచ్చడి తయారీలో బెల్లం, ఉప్పు, వేపపువ్వు, చింతపండు, పచ్చి మామిడి ముక్కుల, మిరపపొడి ఉపయోగిస్తారు. వీటితోపాటు అరటిపళ్ళు, జామకాయలు కూడా వాడతారు.

సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలనే సందేశాన్నిస్తుంది ఉగాది పచ్చడి..