వేసవికాలం వచ్చిందంటే వడగాలులు, దాహం, నీరసం వచ్చేస్తాయి. వేసవిలో చిన్నచిన్న చిట్కాలు పాటించి వేడి నుంచి ఉపశమనం పొందండి

ఆహార పదార్ధాలలో నూనె కొంచెం తగ్గించి వాడుకోండి

ఉదయం పూట నూనె పదార్ధాలు కాకుండా ఉడకబెట్టిన ఆవిరి కుడుములు, ఇడ్లీలు లాంటివి తీసుకోండి

కూరలో ఆకుకూరలు ఎక్కవగా తీసుకోవాలి

మజ్జిగ అన్నంలో మామిడి పళ్లు తింటే విటమిన్ ఏ,డీ ఎక్కువగా శరీరానికి అందుతాయి

కాఫీ,టీ లకు వీలైనంత దూరంగా ఉండండి

నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. ఎక్కువ నీటిని తాగాలి

పలుచని మజ్జిగలో కాసింత ఉప్పు నిమ్మకాయ రసం పిండుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది

Fill in some text

ఆరోగ్య సమస్యలు ఉంటే బయట తిరిగి డీహైడ్రేషన్‌కు గురికాకండి

వేసవి కాలం బయటకు వెళ్లేటప్పుడు మీతో వాటర్ బాటిల్ తీసుకువెళ్ళండి

బయట దొరికే ఫ్రూట్ జ్యూస్‌లు తాగే కన్నా ఇంట్లో తయారు చేసుకుని తాగటం ఉత్తమం

వేసవి కాలంలో పుచ్చకాయ తినడం చాలా మంచిది. ఇందులో 92  శాతం నీరే ఉంటుంది. దీంట్లో కొలెస్ట్రాల్ ఉండదు