సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు

కంటి చూపును మెరుగపరిచే ఆహారాన్ని బాగా తీసుకోవాలి.

పండ్లు, డ్రై ఫ్యూట్స్, గింజలు, గుడ్లు, మొలకలు, పచ్చి కూరగాయలు, క్యారెట్, చేపలు, పాలకూర వంటి వాటిని కచ్చితంగా తినాలి.

కంటి నిండా.. నిద్ర పోవాలి.

టీవీగానీ.. ల్యాప్ టాప్ లేదా ట్యాబ్ లేదా ఫోన్ ను చాలా ఎక్కువగా చూసి ఉంటే.. కూలింగ్ ఐ ప్యాడ్స్ తో కళ్లకు విశ్రాంతినివ్వాలి.

చదివేటప్పుడు వెలుతురు తక్కువగా ఉన్న దీపాలు అస్సలు వాడకూడదు.

ఫ్లోరోసెంట్ లైట్లను దూరం పెట్టాలి..

 ధూమపానం  అలవాటు ఉంటే  వెంటనే మానెయ్యాలి.

ఆరు నెలలకోసారి కళ్ల పరీక్ష చేయించుకోవాలి.

అరచేతులను బాగా రుద్ది.. వెచ్చగా మారిన ఆ అరచేతులను కళ్లపై అదిమి పెట్టుకోవలి..

రోజూ కళ్లను పది సార్లు గుండ్రంగా తిప్పాలి. రెండు వైపులా తిప్పుతూ ఉండాలి.