నేడు తయారవుతున్న అనేక సౌందర్య సాధనాల్లో కలబంద లేకుండా తయారు చేయటంలేదు

కలబందలో గ్లిసరిన్, సోడియం కార్బోనేట్, సోడియం పామ్ కెమేలేట్, సార్బిటోల్ మొదలైనవి వంటి అనేక పోషకాలతో కలిగి ఉంటుంది

ఇది మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరిచి చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది

కాలిన గాయాలపై కలబంద ఆకులను వేడిచేసి రసమును పిండితే బాధ తగ్గటమే కాక వ్రణాలు త్వరగా తగ్గిపోతాయి

సాధారణoగా వయసు పెరిగే కొద్ది చర్మం పైన ముడతలు పడుతూ ఉంటాయి. ఈ యాంటీ ఏజింగ్ సంకేతాలను నివారించడంలో కలబంద సహాయపడుతుంది

కలబంద మరియు ఆలివ్ నూనెతో తయారు చేసిన తేమ ప్యాక్ మీ చర్మం నీ సున్నితంగా మరియు మృదువుగా చేసి ముడతలను తగ్గిస్తుంది

కలబంద మరియు నిమ్మరసం ఇది మొటిమల మచ్చలు తగ్గించడంలో సహాయపడుతుంది

కలబంద కేవలం చర్మ సౌందర్యానికే కాదు  జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది

ఆముదము,కలబంద కలిపి తలకు రాస్తే నిద్రాణమైన జుట్టు పెరుగుదలను ప్రేరేపించటానికి సహాయపడుతుంది

నోటిలో దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నిర్మూలించటంలో కలబంద గుజ్జు ప్రభావవంతంగా పనిచేస్తుంది