అఖండ.. ఆచార్య.. ఈ రెండు సినిమాల్లో కామన్ పాయింట్స్ ఏంటో తెలుసా??
చిరంజీవి, బాలకృష్ణ వీటికంటే ముందు ఇద్దరూ 2019 లోనే చివరిసారిగా థియేటర్లలో కనిపించారు.
వీరిద్దరికి అఖండ, ఆచార్య సినిమాలతో రావడానికి రెండు సంవత్సరాల గ్యాప్ ఏర్పడింది.
ఆచార్య, అఖండ రెండు సినిమాలు కూడా దాదాపు ఒకేసారి షూటింగ్ మొదలయి, ఒకేసారి పూర్తయ్యాయి.
కరోనా కారణంగా ఈ రెండు సినిమాలు పలు మార్లు వాయిదా పడ్డాయి.
ఈ రెండు సినిమాలలో కథ పరంగా మెయిన్ కామన్ పాయింట్స్ ధర్మాన్ని రక్షించడం, మైనింగ్ మాఫియా.
అఖండ సినిమాలో బాలకృష్ణ వచ్చి మైనింగ్ మాఫియా చేసేవాళ్ళని అంతమొందించి ధర్మాన్ని కాపాడతాడు. ఆచార్య సినిమాలో కూడా చిరంజీవి వచ్చి మైనింగ్ మాఫియాని అంతం చేసి ధర్మాన్ని కాపాడతాడు.
ఈ రెండు సినిమాల్లోనూ మెయిన్ క్యారెక్టర్స్ బాలకృష్ణ అఘోరా పాత్రకి, చిరంజీవి నక్సలైట్ పాత్రకి హీరోయిన్ లేదు.
ఈ రెండు సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించాయి.