"శ్రీ శ్రీ " ఈ పేరు వినగానే అందరికీ తొందరగా గుర్తొచ్చేది "పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి…."అనే విప్లవ కవిత్వం .

శ్రీ శ్రీ అసలు పేరు "శ్రీరంగం శ్రీనివాసరావు".గద్యం కవిత్వంమే కాదు పద్య కవిత్వంలో కూడా శ్రీ శ్రీది అందెవేసిన చేయి.

1930 వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది ఆ తర్వాత తెలుగు సాహిత్యం అంతటినీ నేను నడిపిస్తున్నాను అని సగర్వంగా చెప్పుకున్న గొప్ప కవి శ్రీ శ్రీ.

20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి ‘శ్రీశ్రీ’ ఈ శతాబ్దానికి సంబంధించిన తెలుగు సాహిత్యం అంతా నాది అని సగర్వంగా చెప్పుకున్న అసలు సిసలైన యుగకవి శ్రీ శ్రీ.

శ్రీశ్రీ తెలుగు సాహిత్యంలో సూర్యుని వలె తాను వెలుగుతూ తెలుగు సాహిత్యాన్ని వెలిగించినా అభ్యుదయ కవి, విప్లవ యోగి, ఆయన గురించి ఎంత చెప్పినా..ఏం చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది..

శ్రీ శ్రీ రచనలలో .. ముఖ్యమైనవి..

1920 లో "ప్రభవ" శ్రీశ్రీ గారు రాసిన -పద్య కావ్యం .

1950 లో "మహాప్రస్థానం" -శ్రీ శ్రీ గారి అభ్యుదయ కవితా సంకలనం.

1952 లో.. "అమ్మ"-నాటకం (అనువాదం)

1956 లో  "మరో ప్రపంచం"  -రేడియో నాటికలు.

1957 లో చరమరాత్రి..  కథా సంకలనం.

1966 లో "ఖడ్గసృష్టి" -కవితా సంకలనం శ్రీశ్రీ గారికి "మహాప్రస్థానం" తర్వాత అంతటి పేరు తెచ్చిన రచన. ఈ రచనకు గానూ శ్రీ శ్రీ గారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు.

1980 లో "మరో ప్రస్థానం"- విరసం (విప్లవ రచయితల సంఘం) లో ఉండి రాసిన కవితా సంకలనం.

1983 లో "పాడవోయి భారతీయుడా "- గేయ సంకలనం.

1986 లో "అనంతం" శ్రీ శ్రీ గారి ఆత్మకథ.

శ్రీశ్రీ పాటల్లో సగటు మనిషి ఆవేదన ఉంటుంది. వారి బాధలను పోగోట్టే ఆనందం ఉంటుంది.

విప్లవ గీతాలైనా...భావాత్మక గీతాలైనా..దేశభక్తి గీతాలైనా....ప్రణయ గీతాలైనా..విరహగీతాలైనా...విషాద గీతాలైనా...భక్తి గీతాలైనా ఆయన కలం నుంచి అలవోకగా జాలువారిపోయేవి..

ఏప్రిల్ 30 శ్రీశ్రీ పుట్టిన రోజు..1910 ఏప్రిల్ 30న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పటకొండ దంపతులకు జన్మించిన శ్రీశ్రీ యుగకవి,జనకవి,మహాకవి.. తెలుగు సాహిత్యం ముద్దుబిడ్డ  శ్రీ శ్రీ