మధుమేహంతో ఉన్నవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాలి..
గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అధిక కార్బొహైడ్రేట్లు, చక్కెరలు ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి.
మంచి ప్రొటీన్, ఫైబర్ ఉన్నవి ఆహారంలో భాగం చేసుకుంటే అప్పుడు ఆరోగ్యం భద్రంగా ఉంటుంది. మంచి పోషకాలు కలిగి, రక్తంలో గ్లూకోజ్ పెంచనీయని బ్రేక్ ఫాస్ట్ రెసిపీలు ఇవి..
మేథి పరాటా : మెంతి ఆకులతో చేసుకునే పరాటా. మెంతుల్లో జీఐ చాలా తక్కువ. మధుమేహం ఉన్న ఎవరికైనా ఇది మంచి చేస్తుంది. ఈ పరాటాను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే..రక్తంలో గ్లూకోజు పెరగకుండా ఉండడమే కాకుండా, మంచి పోషకాలు లభిస్తాయి.
బేసన్ మేథి చీలా : శనగ పిండి, మెంతి కూరతో చేసుకునే బ్రేక్ ఫాస్ట్ ఇది. మంచి ఫైబర్ తో పాటు, మెగ్నీషియం తగినంత అందుతుంది.
ఉడికించిన కోడిగుడ్డు ఆమ్లెట్ కంటే గుడ్డును ఉడికించి తీసుకోవడం మంచిది.
దీనివల్ల నూనెతో అవసరం పడదు.
కాలాచానా చాట్ శనగలతో చేసుకునే చాట్ ఇది. ఒక రాత్రంతా శనగలను నాన బెట్టి, మర్నాడు ఉదయం వాటిని ప్రెషర్ కుక్కుర్ లో ఉడికించి, వాటికి ఉడికించిన బంగాళాదుంపలు, మసాలా జోడించుకుని తినేయడమే.
రాగి, గోధుమ పిండి, మజ్జిగ కలిపి రాత్రంతా అలా ఉంచేసి మర్నాడు ఉదయం దోశలా పోసుకుని తినేయడమే.
రాగి పిండితో దోశ పోసుకోవడం వల్ల మంచి పోషకాలు అందడమే కాదు.. రక్తంలో గ్లూకోజ్ కూడా చక్కటి నియంత్రణలో ఉంటుంది.