భోజనం చేసిన వెంటనే టీ తాగటం మంచిది కాదు.

తేయాకులో ఉండే ఆమ్లాలు ఆహారంలో ఉండే మాంసకృత్తులను వినియోగించుకోకుండా అడ్డుకునే అవకాశం.

భోజనం చేసిన వెంటనే పండ్లను ఎక్కువగా తీసుకోకూడదు.

ఇలా తీసుకుంటే పొట్ట పెరిగే అవకాశం.

భోజనం చేసిన తరువాత స్నానం చేయటం వల్ల  కాళ్లు, చేతుల్లో  రక్తప్రసరణ పెరుగుతుంది. 

అదే క్రమంలో పొట్ట చుట్టూ రక్త ప్రసరణ తగ్గి జీర్ణ వ్యవస్ధ పనితీరు మందగిస్తుంది.

తిన్న మరుక్షణమే నడవటం ఏమాత్రం మంచిది కాదు.

అలా నడవటం వల్ల పోషకాలను గ్రహించటంలో జీర్ణ వ్యవస్ధ విఫలమవుతుంది.

తిన్న వెంటనే కాకుండా తిన్న ఒక పావుగంట తర్వాత నడవటం మంచిది.

తిన్న వెంటనే నిద్ర పోవటం ఏమాత్రం మంచిది కాదు.

ఇలా నిద్ర పోవటం వల్ల తిన్న ఆహారం జీర్ణకాక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.