వేడి నుంచి ఉపశమనం పొందడానికి, వ్యాయామం చేయడానికి ఈత కొట్టడం బెస్ట్ అంటున్నారు నిపుణులు.

ఒక గంట పాటు ఈత కొడితే..  అది ఒక గంట పరిగెత్తినంతగా ఎక్కువ కేలరీలు బర్న్ చేస్తుంది.

ఈత శరీరంలోని అన్ని కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది. వేసవిలో వ్యాయామం చేయడానికి ఈత మంచిది.

స్విమ్మింగ్ అనేది పూర్తి శరీర వ్యాయామం. ముఖ్యంగా కార్డియో వ్యాయామం.

ఈత చేతులు, భుజాలకు కూడా బలాన్ని చేకూర్చి.. కండరాలను టోన్ చేస్తుంది. దీంతోపాటు శక్తిని కూడా పెంచుతుంది.

స్విమ్మింగ్ గుండె, శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈత కొట్టడం వల్ల రక్తపోటు తగ్గుతుందని, మధుమేహం కూడా అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈత కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.

వేసవిలో స్విమ్మింగ్ పూల్ లోని గోరువెచ్చని నీటిలో ఈత కొడితే..శరీర నొప్పులు దూరమవుతాయి.

ఈత ఊపిరితిత్తులను బలంగా చేస్తుంది. ఊపిరితిత్తులలో ఆక్సిజన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎక్కువ కాలం శ్వాసను బిగ పట్టుకునే సామర్థ్యం సైతం పెరుగుతుంది.

ఈత కొట్టడం వల్ల శరీరం రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఒత్తిడి స్థాయి తగ్గుతుంది. అందుకే స్విమ్మింగ్ చేస్తే మంచిగా నిద్ర పట్టడంతోపాటు ఒత్తిడి దూరమవుతుంది.