అంద‌మైన ముఖంపై మొటిమ‌లు క‌నిపిస్తే చికాకు పెడుతుంది. కొన్నిసార్లు అవి నొప్పికూడా  పెడ‌తాయి. ఆ నొప్పి త‌గ్గాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే స‌రిపోతుంది.

మొటిమ‌ల వ‌ద్ద స‌లిపిన‌ట్లుగా నొప్పి వ‌స్తోంటే చాలా మంది గిల్లుతుంటారు. ఆ అల‌వాటు మానుకోండి.

ముఖాన్ని శుభ్రంగా క‌డిగి, పొడి వ‌స్త్రంతో తుడ‌వాలి. ఆపై శుభ్ర‌మైన వ‌స్త్రంలో ఐస్ ఉంచి దానిమీద మృదువుగా 5 నుంచి 10 నిమిషాల పాటు అద్దండి

ప‌దిహేను నిమిషాలు విరామమిస్తూ.. రెండు మూడు సార్లు ఐస్ పెడితే వాపుతో పాటు నొప్పి త‌గ్గుతుంది.

మొటిమ‌లు త‌ర‌చూ వ‌స్తోంటే బెంజాల్ పెరాక్సైడ్ 2శాతం ఉన్న క్రీముల‌ను తెచ్చిపెట్టుకోవ‌డం మంచిది.

ముఖంపై మొటిమ‌లు ఉన్న‌చోట శుభ్రంగా క‌డిగి క్రీము రాస్తే బ్యాక్టీరియాను చంప‌డ‌మే కాకుండా, వాపునీ త‌గ్గిస్తుంది. నొప్పి అదుపులో ఉంటుంది.

మొటిమ ఎర్ర‌గా మారి కాస్త చీము క‌నిపిస్తుంటే వేడి కాప‌డం పెట్ట‌డం మంచిది.

వేడి నీటిలో ముంచిన వ‌స్త్రాన్ని నీరు లేకుండా బాగా పిండి, నొప్పి ఉన్న‌చోట ఐదు నిమిషాలు ఉంచాలి. మ‌రీ వేడి ఉండ‌కుండా చూసుకోవ‌డం మంచిది.

మొటిమ క‌నిపించ‌గానే చాలా మంది పేస్ట్ రాస్తారు. దీంట్లో హైడ్రోజ‌న్ పెరాక్సైడ్‌, బేకింగ్ సోడా, ఆల్క‌హాల్ వంటివి ఉంటాయి. పేస్ట్ పెట్ట‌క‌పోవ‌టం మంచిది.