వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్లను గట్టిగా హెచ్చరిస్తోంది.

ప్రత్యేకించి భారతీయ వాట్సాప్ యూజర్లు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.

మెసేజింగ్ యాప్ ఫేక్ వెర్షన్‌ల గురించి తెలుసుకోవాలని యూజర్లకు సూచిస్తోంది.

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ CEO, విల్ క్యాత్‌కార్ట్ వాట్సాప్ యూజర్లను హెచ్చరిస్తున్నారు

WhatsApp మాడిఫైడ్ వెర్షన్లను అసలే వాడొద్దని ట్విట్టర్‌ వేదికగా ఆయన అభ్యర్థిస్తున్నారు. 

సైబర్ నేరగాళ్లు, స్కామర్‌లు వివిధ పద్ధతుల ద్వారా యూజర్ల డేటాను తస్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

వాట్సాప్ తరహాలో సర్వీసులను అందించేలా కొన్ని హానికరమైన యాప్‌లను సెక్యూరిటీ రీసెర్చ్ టీమ్ గుర్తించింది.

“Hey WhatsApp” వంటి యాప్‌లు అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తోంది.

WhatsApp మాడిఫైడ్ లేదా ఫేక్ వెర్షన్లను WhatsApp మాదిరిగానే ఫీచర్‌లను అందిస్తున్నాయి.