సీనియర్ నటుడు,రచయిత, దర్శకుడు ప్రతాప్ పోతెన్ (70) ఈరోజు కన్నుమూశారు

శుక్రవారం ఉదయం ఆయన చెన్నైలోని కిల్‌పాక్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో  విగతజీవిగా కనిపించారు

సీనియర్ నటి రాధికను 1985లో ఆయన వివాహం చేసుకున్నారు. ఆతర్వాత వారిద్దరి మధ్య అభిప్రాయబేధాలు రావటంతో 1986లో విడిపోయారు

1990లో అమలా సత్యనాధ్ అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ 22 ఏళ్ల తర్వాత 2012 లోవిడిపోయారు. వారికి ఒక కుమార్తె ఉంది

తెలుగు,తమిళ,మలయాళ, హిందీ భాషల్లో 100కి పైగా సినిమాల్లో నటించి  గా మెప్పించిన ప్రతాప్ పోతెన్ డైరెక్టర్‌గా 10 సినిమాలు తెరకెక్కించారు

తెలుగులో అక్కినేని నాగార్జున నటించిన చైతన్య చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు

వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన ఆయన విద్యాభ్యాసం ఊటీలోని లవ్‌డేల్ లారెన్స్ స్కూల్లోనూ..మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలోనూ జరిగింది

సినిమాల్లోకి రాక ముందు ప్రతాప్ పోతన్ ముంబైలో యాడ్ ఏజెన్సీలో  కాపీ రైటర్ గా పని చేశారు

1978లో ఆరవం అనే మళయాళీ సినిమాతో  ఆయన చలన చిత్ర రంగంలోకి  నటుడిగా అడుగు పెట్టారు

1985‌లో దర్శకుడిగా మారి మీండు ఒరు కాథల్ కథై అనే సినిమా తీసి దానికి ఉత్తమ దర్శకుడి అవార్డును కూడా అందుకున్నారు

తెలుగులో ఆయన ఆకలిరాజ్యం,కాంచనగంగ, జస్టిస్ చక్రవర్తి,మరోచరిత్ర, వీడెవడు  వంటి  చిత్రాల్లో నటించారు