ప‌లు ర‌కాల ఔష‌ధ‌గుణాలున్న అశ్వ‌గంధ‌తో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు ఎన్నో ఉన్నాయి.

క‌ప్పు నీళ్ల‌లో పావుచెంచా అశ్వ‌గంధ పొడి వేసి మ‌రిగించి వ‌డ‌క‌ట్టాలి.

ఇందులో అర‌చెక్క నిమ్మ‌ర‌సం, చెంచా తేనె క‌లిపి టీ త‌యారు చేయాలి.

నిద్ర‌పోయే ముందు ఈ టీ తాగితే ఒత్తిడి, ఆందోళ‌న, కుంగుబాటు వంటి వాటికి దూరంగా ఉండొచ్చు.

కంటినిండా నిద్రపోవ‌చ్చు, మాన‌సిక ప్ర‌శాంత‌తతో పాటు ఉత్సాహంగా ఉండొచ్చు.

ఈ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ శ‌రీరంలోని జీవ‌క్రియ‌ల‌ను వేగ‌వంతంగా చేస్తాయి.

కొవ్వు క‌రుగుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయులు త‌గ్గ‌డంతో అధిక బ‌రువు స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.

ర‌క్త‌పోటును అదుపు చేసి కొలెస్ట్రాల్  స్థాయుల‌ను త‌గ్గిస్తుంది.

మెనోపాజ్ త‌ర్వాత ఎదుర‌య్యే హృద్రోగ స‌మ‌స్య‌కు దూరం ఉండొచ్చు.

40 నుంచి 50ఏళ్ల వ‌య‌స్సు క‌లిగిన వారు టీని ప్ర‌తిరోజూ తీసుకుంటే నిద్ర‌లేమి స‌మ‌స్య‌ నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు.

త‌ర‌చూ మ‌తిమ‌ర‌పు అనిపించిన‌ప్పుడు ఈ టీకి ప్రాముఖ్య‌త‌నిస్తే చాలు.

న‌రాల‌ను శ‌క్తివంత‌మ‌య్యేలా మారుస్తుంది .

వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచి జ‌లుబు, ద‌గ్గు, సీజ‌న‌ల్ అనారోగ్యాల‌కు దూరంగా ఉండొచ్చు.