నాగ చైతన్య సినిమాల లైనప్

జులై 22న 'థాంక్యూ' సినిమాతో రాబోతున్నాడు చైతూ.

ఆగస్టు 11న అమీర్ ఖాన్ తో కలిసి నటించిన బాలీవుడ్ సినిమా 'లాల్ సింగ్ చద్దా' మూవీ రిలీజ్ కాబోతుంది.

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో కృతి శెట్టి హీరోయిన్ గా ఓ సినిమా చేయబోతున్నాడు. చైతూ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కనపడబోతున్నాడు.

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'దూత' వెబ్ సిరీస్ షూట్ జరుగుతుంది.

సర్కారు వారి పాట డైరెక్టర్ పరుశురాంతో కథ ఓకే చేశాడు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. 

తరుణ్ భాస్కర్ తో కథా చర్చలు జరుగుతున్నాయి. ఇది కూడా ఓకే అయ్యే అవకాశం ఉంది.