అల్లం నలుపు రంగులో కూడా ఉంటుందని మీకు తెలుసా? దీన్నే నల్ల పసుపు అంటారు.

ఈ నల్ల పసుపుతో చాలా ఉపయోగాలున్నాయిని తెలుసా? అవేంటో తెలుసుకుందాం..

అల్లం నల్లటి రంగులో కూడా ఉంటుంది. దీన్ని నల్ల పసుపు అని పిలిచినప్పటికీ.. నలుపు, నీలం రంగుల కలయికతో ఉంటుంది.

నల్ల పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ-ఆస్తమా, యాంటీ ఆక్సిడెంట్, అనాల్జేసిక్, లోకోమోటర్ డిప్రెసెంట్, యాంటీ అల్సర్ లక్షణాలు ఉంటాయి.

ఇవి ఆందోళన, సీఎన్ఎస్ డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. నల్ల పసుపు మన శరీరాన్ని వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

నల్ల పసుపు పొట్ట సంబంధ సమస్యలను నయం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

కడుపునొప్పి లేదా గ్యాస్ సమస్య ఉన్నవారు ఈ నల్ల పసుపు వాడితే మంచి ఫలితం ఉంటుంది.

నల్ల పసుపు పొడిని నీళ్లలో కలిపి ప్రతీరోజు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

నల్ల పసుపు జలుబు, దగ్గు, ఆస్తమాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

నల్ల పసుపు పొడిని వేడి పాలల్లో కలుపుకుని తాగితే..మహిళలు బహిష్టు సమయంలో ఎదుర్కొనే పొత్తికడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.