వర్షాకాలం. దోమలు ఎక్కువగా పెరిగే కాలం. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వ్యాధుల ప్రమాదం ఉంటుంది.
దోమల రక్షణ కోసం స్ప్రేలు,ఇతర రసాయనిక మందులను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటి వలన చాలా మందికి అలెర్జీ వచ్చే ప్రమాదం ఉంది..
అందుకనే వాతావరణం శుభ్రపడాలంటే..కొన్ని మొక్కల్ని పెంచుకోవాలి. ఈ మొక్కల వల్ల దోమలు రాకుండా చేసుకోవచ్చు.. అటువంటి మొక్కలేంటో తెలుసుకుందాం..
ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలంటే డోర్ లేదా బాల్కనీలోని కుండీలో ‘వేప’ మొక్క నాటండి. బోన్సాయ్ వేప మొక్కలు బాగా ఈజీగా ఉంటాయి..
రోజ్మేరీ మొక్క పువ్వుల వాసన ఘాటుగా ఉంటుంది. ఈ వాసనకు దోమలు పారిపోతాయి.
ఇంటి బాల్కనీ,మెయిన్ డోర్స్ వద్ద తులసి మొక్క ఉంటే దోమలు ఇంట్లో రావడాన్ని నియంత్రిస్తుంది. తులసి మొక్క నుంచి వచ్చే స్మెల్ కారణంగా దోమలు ఇంట్లోకి రావు..
దోమలను తరిమికొట్టడానికి ‘నిమ్మగడ్డి’ చక్కటి ఆయుధం. నిమ్మగడ్డి నూనెను దోమల నివారణ క్రీములు, రిపెల్లెంట్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు.
పుదీనా ఆకుల్లా ఉండే‘క్యాట్నిప్’మొక్క దోమల నుండి మాత్రమే కాదు.. ఇతర కీటకాలు, సాలెపురుగుల నుండి కూడా రక్షించడంలో బెస్ట్..
‘అజెరాటం’ మొక్క క్రిమిసంహారక లక్షణాలున్న మొక్క. ఈ మొక్క పూలు లేత నీలం, తెలుపు రంగులో ఉంటాయి. ఈ పువ్వుల వాసన చాలా ఘాటుగా ఉంటుంది. ఈ వాసనకు దోమలు రావు.