భారత 15 రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా..భారత రాష్ట్రపతి భవనంతో పాటు..ప్రపంచంలోని 10 అద్భుతమైన రాష్ట్రపతి భవనాలపై ఓ లుక్కేద్దాం..
రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్ 15 ఎకరాలలో విస్తరించి
330 ఎకరాల్లో ఇంగ్లీష్ అక్షరం H ఆకారంలో ఉన్న భారత రాష్ట్రపతి భవనంలో..340గదులు ఉన్నాయ్. రాష్ట్రపతి నిలయంలో దాదాపు 190 ఎకరాల్లో రకరకాల పూలతోటలు ఉంటాయ్. ప్రపంచంలోనే అరుదైన వృక్ష, పువ్వుల జాతులు ఉన్నాయి..
టర్కీలోని రాష్ట్రపతి భవన్ వైట్ హౌస్ కంటే 50 రెట్లు పెద్దది. ఇందులో 1000 గదులు ఉన్నాయి. ఈ భవనం ప్రపంచంలోనే అత్యంత అందమైన,అద్భుతమైనది..
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌లో 132 గదులున్నాయి.
6 అంతస్తుల్లో ఉన్న
ఈ భవనంలో 132 గదులు..35 బాత్రూమ్లు, 147 కిటికీలున్నాయి..
రష్యా..అధ్యక్షుని అధికారిక నివాసాన్ని క్రెమ్లిన్ అని పిలుస్తారు. మాస్కో మధ్యలో ఉన్న ఈ భవనాన్ని క్రీ.శ. 1492లో నిర్మించారు. పింక్ కలర్ ఇటుకలతో.. ఒకటిన్నర మైళ్ల చుట్టుకొలతలో త్రిభుజాకారంలో ఉంటుంది..
లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ బ్రిటిష్ రాచరికరపు అధికారిక నివాసం. క్వీన్ ఎలిజబెత్ అధికారిక నివాసం కూడా అయిన ఈ భవనాన్ని "ది క్వీన్స్ హౌస్" అని పిలుస్తారు.
ఇటలీ రాజధాని రోమ్‌లోని ఎత్తైన కొండపై ఉన్న ఈ భారీ ప్యాలెస్‌ను 1583లో నిర్మించారు. ఇది ఇటలీ అత్యంత శక్తివంతమైన నాయకులలో కొంతమందికి నిలయం..
టోక్యోలోని చియాడా వార్డ్‌లో ఉన్న పెద్ద పార్క్ లాంటి ప్రాంతంలో ఉంది జపాన్ చక్రవర్తి నివాసం. ప్రధాన ప్యాలెస్‌తో సహా పలు భవనాలున్నాయి. తోటలతో సహా మొత్తం వైశాల్యం 1.15 చదరపు కిలోమీటర్లు (0.44 చదరపు మైళ్ళు)..
చైనా అధ్యక్షుడి అధికారిక నివాసం జోంగ్నాన్హై. ఇది వాస్తుశిల్పానికి ప్రత్యేక ఉదాహరణ. భద్రతా కారణాలతో ఇక్కడికి ప్రజలకు ఎప్పుడూ అనుమతి ఉండదు..
62 ఎకరాల్లో..150,000 బ్లూ గ్రానైట్ టైల్స్ తో నిర్మించిన ఈ బ్లూ హౌస్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇద్దరికీ నివాసం. ఇక్కడే 31 మంది ఉత్తర కొరియా కమాండర్లు 1968లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను హత్య చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.