అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ తో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు

బ్రెయిన్ స్ట్రోక్ కుడా గుండెపోటు లాగే ఒక అత్యవసర వైద్య స్థితి. 

అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారిలో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఎక్కువ.

వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం కూడా ఉంది.  

మదుమేహం, సంతాన నిరోధక మాత్రల వినియోగం, ధూమపానం, మద్యం అలవాట్లు వంటివి కూడా దీనికి కారణం.

 శరీరంలో కుడి, ఎడమవైపు మొహం, చెయ్యి, కాలు చచ్చుబడిపోయినట్లు అనిపిస్తుంది. 

కంటిచూపు మందగించటం, ఒక వస్తువు రెండుగా కనిపించటం, అసాధారణమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించటం మంచిది. 

 స్ట్రోక్ రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. 

పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, తృణధాన్యాలు, వంటి వాటిని ఆహారంలో తీసుకోవాలి. 

 రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. 

 వ్యాయామాలు చేయటం మంచిది. మానసిక ఒత్తిడులను తగ్గించుకోవాలి. 

అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి.