భారత్ లో 20 శాతం మంది ఏదో ఒకసారి డిప్రెషన్ బారిన పడినట్లు గణాంకాలు చెప్తున్నాయి.
చిన్న విషయాలకే చిరాకు,నిరుత్సాహం, బాధ,ఒంటిరిగా ఉండాలనిపించటం,నిద్ర పట్టకపోవడం, నిస్సత్తువ, ఆకలి తగ్గటం,తలనొప్పి, ఆత్మన్యూనత,ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వంటివి డిప్రెషన్ లక్షణాలు..
డిప్రెషన్ నుంచి విముక్తి కోసం
మ్యాజిక్ మష్రూమ్స్ అని పిలిచే
ఒక రకం పుట్టగొడుగులు
చాలా ఉపగపడతాయని
ఓ అధ్యయనంలో తేలింది.
ఈ పుట్టగొడుగుల్లో ఉండే ‘సైలోసిబిన్’ అనే సైకెడెలిక్ పదార్థం డిప్రెషన్‌పై ప్రభావం చూపుతుందని లండన్‌లోని సెంటర్ ఫర్ సైకెడెలిక్ రీసెర్చ్ అధ్యయనకారులు తెలిపారు.
డిప్రెషన్‌కు చికిత్స పొందే 60 మంది రోగుల మెదడును స్కాన్ చేసి చికిత్స ప్రభావాలను ఉత్పత్తి చేయటానికి సైలోసిబిన్ ఎలా ఉపయోగపడుతుందో గుర్తించారు.
మ్యాజిక్ మష్రూమ్‌ల్లో మొదడును రీసెట్ చేసే ఉత్ర్పేరకాలున్నట్లు తేలింది. వీటిలోని ‘సైలోసిబిన్’ అనే పదార్థం డిప్రెషన్ రోగుల మెదడులో చక్కటి మార్పుల్ని తీసుకొచ్చిందని గుర్తించిన పరిశోధకులు..
సైలోసిబిన్ ఇవ్వక ముందు, ఇచ్చిన తర్వాత వారి మెదళ్లను స్కాన్ చేసి రెండు కీలక మార్పులను కనుగొన్నారు..
పుట్టగొడుగులను తినేవారిలో డిప్రెషన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని ఒక నివేదిక తెలిపింది.
అందుకే మానసిక ఆరోగ్యం కోసం పుట్టగొడుగులను వారంలో ఒకసారైనా తినాలని ఆహారనిపుణులు చెబుతుంటారు.
పుట్టగొడుగుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్లు, విటమిన్లు, ఖనిజాలతోపాటు ఎర్గోథియోనినన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఇవే యాంటీ డిప్రెసెంట్లుగా పనిచేసి మనల్ని ఆరోగ్యవంతులుగా ఉంచుతాయి..