కాకరకాయల్లా ఉండే బుడ్డి బుడ్డి కాకరకాయలు అవేనండీ బోడకాకరకాయలు. ఇవి చక్కటి టేస్టే కాదు వర్షాకాలంలో వీటితీ తింటే..
కలిగే ప్రయోజనాలేంటో చూసేద్దాం..
ఈ కాకరకాయలో ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, విటమిన్ ఎ, విటమిన్ బి 1, బి 2, బి 3, బి 5, బి 6, బి 9, బి 12, విటమిన్ సి, విటమిన్ డి 2, 3, విటమిన్ హెచ్, విటమిన్ కె, కాల్షియం, పుష్కలంగా లభిస్తాయి.
బోడకాకరనే ఆకాకర అని కూడా అంటారు. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, తుమ్ములను నుంచి బోడ కాకర రక్షిస్తుంది. అంతేకాదు వివిధ అలెర్జీలకు దూరం చేస్తుంది.
బోడ కాకరలను కూర చేసేటప్పుడు పైన ఉండే తొక్కును తొలిగించకూడదు. అలా చేస్తే అందులో ఉన్న పోషకాలన్ని పోతాయి.
బోడకాకరలో ఉండే ఫొలేట్లు శరీరంలోని కొత్త కణాలను వృద్ది చెందేలా చేస్తాయి. ఇవి గర్భంలోని శిశువు ఎదుగుదలకు ఉపయోగపడుతాయి.
బోడకాకర డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. దీంట్లో ఉండే కెరోటెనాయిడ్లు కంటి సంబంధ వ్యాధులను దరిచేరకుండా చేస్తుంది.
బోడకాకరలో ఉండే విటమిన్ సి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.
రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
క్యాన్సర్ వంటి పెద్ద వ్యాధుల బారిన పడకుండా చూసేందుకు బోడ కాకర ఎంతో తోడ్పడుతుంది.
చర్మం మెరుగుపడేందుకు కూడా బోడ కాకర ఎంతో ఉపయోగపడుతుంది.