పగటి పూట చర్మానికి మేకప్ అద్దినా..
రాత్రి సమయంలో నిద్రకు ముందు వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయాలి.
చాలామంది తెలిసో తెలియకో చేస్తున్న పొరపాట్ల ఫలితంగా చర్మానికి హాని కలుగుతుంది.
రాత్రి వేళ పడుకునే ముందు మేకప్ అలాగే వదిలేస్తున్నారు.
ఇలా చేయటం వల్ల చర్మానికి తీవ్రమైన హాని కలుగుతుంది.
రాత్రి నిద్రకు ముందు ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి.
ప్రతిరోజూ చేయటం వల్ల చర్మ ఆరోగ్యం బాగుంటుంది.
రాత్రి మేకప్‌తో నిద్రపోవడం వల్ల పునరుద్ధరణ ప్రక్రియకు ఆటంకం.
క్రమేపి వృద్ధాప్యంగా కనిపించే చర్మానికి దారి తీస్తుంది.
చాలావరకు మేకప్ నూనె ఆధారితమైనది.
ఇది చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది.
మొటిమలకు దారి తీస్తుంది.