మీ Vi నంబర్‌ని Jioకి ఎలా పోర్ట్ చేయవచ్చో తెలుసా?

Vi నుంచి Jioకి పోర్ట్ చేయాలంటే.. ప్రస్తుత నంబర్ నుంచి 1900కి PORT అని SMS చేయండి.

మీరు UPC కోడ్, గడువు తేదీని SMSతో పొందివచ్చు. 

UPC (యూనిక్ పోర్టింగ్ కోడ్)తో సమీప Jio Store లేదా జియో రిటైలర్‌ (Jio Retailer)లోకి వెళ్లండి.

పోర్ట్ రిక్వెస్ట్ కోసం మీ ఆధార్ కార్డ్ లేదా అడ్రస్ ప్రూఫ్ (POA) / ఐడెంటిటీ ప్రూఫ్ (POI) డాక్యుమెంట్లు తీసుకెళ్లండి. 

మీరు Vi పోస్టు పెయిడ్ అయితే బిల్లులు పెండింగ్ లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత మీ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది. 

మీరు Vi నుంచి Jio పూర్తిగా పోర్టబుల్ కావడానికి కనీసం 3 రోజుల వరకు పట్టవచ్చు. 

Jio రిటైలర్ ప్రకారం.. మీరు రూ. 300 కన్నా ఎక్కువ విలువైన ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రీ కాదని గుర్తించుకోండి. 

జమ్మూ & కాశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల నుంచి పోర్ట్-ఇన్ (Port-in) రిక్వెస్ట్ పొందాలంటే 15 వర్కింగ్ డేస్‌లో పూర్తవుతుంది. 

ఒకవేళ మీరు Vi to Airtelకి పోర్ట్ చేయాలనుకుంటే.. ఇదే ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది.