ప్రతిరోజూ జీడిపప్పు పలుకులు నాలుగు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు.

జీడిపప్పును రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే చర్మానికి, కంటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

జీడిప‌ప్పు శరీరంలోని అనవసర కొవ్వును తగ్గిస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్ చార్టులో జీడిపప్పును చేర్చుకోవచ్చు.

చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పించి, చర్మం మెరిసేలా చేస్తుంది.

జీడిపప్పులో లుటిన్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.

జీడిపప్పులో ఉండే ఈ పోషక గుణాల వల్ల ఎండ నుంచి కళ్లకు రక్షణ కల్పిస్తుంది. 

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచి, కంటి చూపును సంరక్షిస్తుంది.

జీడిపప్పులో మెగ్నీషియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

జీడిపప్పు తీసుకోవడం వల్ల మైగ్రేన్ నొప్పి కూడా తగ్గుముఖం పడుతుంది.

క్యాన్సర్‌ నివారణలో జీడిపప్పు ఉప‌యోగ‌ప‌డుతుంది.